భర్త తప్పు చేస్తే !!!
మొదటగా నిలదీయాల్సింది –
సహధర్మచారిణి అయిన భార్య.
తండ్రి తప్పుచేస్తే !!!
ఇదేంటి నాన్నా..అని ముందుగా అడగాల్సింది-
ఎదిగొచ్చిన పిల్లలు.
ఒక నాయకుడు తప్పు దారిలో నడుస్తుంటే !!!
తొట్టతొలుత గద్దించాల్సింది –
వెన్నంటి నడిచే ఆయన అనుచరులు
దేశ ప్రజలకు అవసరమైన సమాచారం ఇవ్వకుండా
ఒక దేశాధినేత తప్పించుకుంటూ
తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటే.... !!!
అందరికంటే ముందర
రాజకీయపార్టీలకు అతీతంగా ప్రశ్నించాల్సింది
– ఆ దేశ పౌరులు
....
ఈ బాధ్యతలన్నీ పద్ధతి ప్రకారం
నిర్భయంగా, నిరాటంకంగా, నిస్సంకోచంగా జరిగితే
దానిని ఏమంటారు...!!!!
....
ఇలా ప్రశ్నించడమే తప్పు..అది మన సంప్రదాయం కాదు...
అనే వాళ్ళను ఏమంటారు ?
- ములుగు రాజేశ్వర రావు
ఆ ఒక్కటి అడగద్దు
రిప్లయితొలగించండి