ఆది శంకరుడు ఎప్పటివాడు !!!



ఆది శంకరుడు ఎప్పటివాడు !!!

ఎన్ని మఠాలు... ఎప్పుడు పెట్టాడు !!!

....ఒక ప్రామాణిక పరిశోధన/ప్రయత్నం

 

శతాబ్దాలు, సహస్రాబ్దాల తరబడి అల్లకల్లోలంగా సాగిన భారతీయ జీవనగమనంలో- సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగాలపరంగా ఏకత్వాన్ని ప్రవచించి, ఆచరించి, సాధించి  సమాజమంతటా ఒక క్రమానుగతిని,  ఉన్నంతలో ప్రశాంతతను సిద్ధింపచేసిన బహుముఖ ప్రజ్ఞావంతుడు –ఆది శంకరాచార్యులు.

ఆయన జనన మరణాలు, మఠాలస్థాపన, శంకరవిజయాలవంటి జీవిత చరిత్రలకు సంబంధించిన వివరాలు ... సువిశాల భారతదేశంలో, హైందవ సమాజంలో మొదటినుంచీ వివాదాలబారిన పడుతూనే ఉన్నాయి.  మతపరంగా కానీ, ప్రభుత్వపరంగా కానీ దీనిపై స్పష్టత తేవడానికి, జనసామాన్యంలో గందరగోళం తొలగించడానికి గతంలో అసలు ప్రయత్నాలు  జరగలేదా ???

అది జరిగింది1988లో...

అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ‘రాష్ట్రీయ శంకరజయంతి మహోత్సవ్’ ను నిర్వహించడం ద్వారా శంకరాచార్యుల వారికి ఘనంగా నివాళి అర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు రాజీవ్ గాంధీ అధ్యక్షతన ఒక జాతీయ సంఘం ఏర్పడింది. శంకరుల సిద్ధాంతాలు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలపై  ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు నిర్వహించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ- సాంస్కృతిక విభాగం, విశ్వవిద్యాలయ విరాళాల సంఘం(యుజిసి)లు ఉమ్మడిగా ఈ బాధ్యతను నిర్వర్తించాయి. ఈ సెమినార్లలో జరిగిన చర్చలు, తీర్మానాలను క్రోడీకరించి ప్రచురించారు. అంతటితో తృప్తిపడకుండా ... ఇవి ఆధునిక సమాజానికి ఎలా ఉపయోగపడగలవో .. అలా వాటిని అన్వయిస్తూ ప్రజలకు సులభంగా అర్థమయ్యేవిధంగా ఒక పుస్తకంగా తీసుకువస్తే బాగుంటుంది – అని సమన్వయ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఈ బాధ్యతను ప్రముఖ సంస్కృత పండితుడు, అడయార్ లైబ్రరీ, రీసెర్చి సెంటర్‌కు చెందిన గౌరవ ప్రొఫెసర్ డా. ఎస్. శంకరనారాయణన్‌కు అప్పగించారు. ఆయన సెమినార్ల తాలూకు సమాచారాన్ని వడగట్టడమే కాక, స్వంతంగా సశాస్త్రీయంగా పరిశోధన చేసి.. ఒక పుస్తకం నమూనా ప్రతిని సిద్ధం చేసి  1990లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. దీనిని ప్రభుత్వం  మళ్ళీ ఒక నిపుణుల కమిటీకి నివేదించింది. అది క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ దానిని పుస్తకంగా ప్రచురించడానికి  ఆమోద ముద్ర వేసింది.

ప్రభుత్వం దీని ముద్రణకు ఆర్థికంగా సహకరించింది.  అంతర్జాతీయ దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలు శ్రీమతి రాధా బర్నయిర్, మైలాపూర్ శ్రీరామకృష్ణ మఠ్ అధ్యక్షులు స్వామి స్మరణానందజీలు ‘ముందుమాట’ రాసారు. 1995లో దీనిని మొదటిసారిగా ప్రచురించారు.

-ములుగు రాజేశ్వర రావు

rrmulugu@gmail.com

...................

(ముందే ఒప్పుకుని ఉన్న కొన్ని పనుల వత్తిడి కారణంగా ఈ పుస్తకంలోని ప్రస్తుత చర్చనీయాంశాలను  వెంటనే అందించలేకపోతున్నా. వీలు చిక్కినప్పుడు ఆ పని చేస్తా. ఈలోగా ఈ పుస్తకం అందుబాటులో ఉన్నవారు లేదా సేకరించుకోగలిగినవారు ఆ పనికి పూనుకోవడానికి వీలుగా ఈ వివరాలు ఇస్తున్నా.)




Title :  SRI SANKARA

Tag line: HIS LIFE, PHILOSOPHY AND RELEVANCE TO MAN IN MODERN TIMES

Author: DR.S.SANKARANARAYANAN

Publisher/Distributor:  

THE  ADAYAR  LIBRARY  AND  RESEARCH CENTRE, MADRAS

………..

(మీ అభిప్రాయాలు/వ్యాఖ్యలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో  పెట్టండి.  అందరూ చూస్తారు)

2 కామెంట్‌లు:

ఆది శంకరుడు ఎప్పటివాడు !!! ఎన్ని మఠాలు ... ఎప్పుడు పెట్టాడు !!! ....ఒక ప్రామాణిక పరిశోధన/ప్రయత్నం   శతాబ్దాలు, సహస్రాబ్దాల తరబడి అల...